డాక్టర్ బి సదాశివయ్య
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని డాక్టర్ బి. సదాశివయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రకృతి పరిరక్షణ అనే అంశంపై పట్టణంలోని మున్సిపల్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులను ఒకచోట చేర్చి, సేవ్ నేచర్ ఇట్ సేవ్స్ అవర్ ఫ్యూచర్ అనే అంశంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సదాశివయ్య మాట్లాడుతూ పాములలోని విషపూరిత పాములు విషపూరితము కానీ పాములను గురించి వారు ఉపన్యసించడం జరిగిందని తెలిపారు. అలాగే అనంతపురం ఏజీ అనిల్ కుమార్ రెడ్డి మొక్కలు పెంచడం వల్ల వాటి ఉపయోగం నువ్వు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. తదుపరి మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరి దేవి గోపాల్ నాయకులు పాల్గొని పిల్లలలో ఉత్సాహం మేల్కొల్పడం జరిగిందని వారు తెలిపారు. తదుపరి పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. డీసీబీసీ గౌరవ అధ్యక్షులు గోరకాతి పెద్దారెడ్డి మాట్లాడుతూ మనిషికి కావలసిన ఆక్సిజన్ అందించే చెట్లను నాటడం వలన వాటిని సంరక్షించడం వలన కలిగే ఉపయోగాలను తెలపడం జరిగిందని తెలిపారు. డీసీబీసీ సంస్థ అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ పెద్దలు చెప్పిన ప్రతి మాటను విద్యార్థులు తూచా తప్పకుండా పాటించినప్పుడే, తదుపరి విజయము అనుకున్న లక్ష్యము నెరవేరుతుందని తెలిపారు. అనంతరం ఈ సదస్సుకు విచ్చేసిన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు బీసీ బీసీ సభ్యులు కు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.