సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్
విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణం సుందరంగా తీర్చి దిద్దుతామంటూ నమ్మబలికిన ప్రజా ప్రతినిధులు ఈరోజు పట్టణ సమస్యలపై సిపిఐ నాయకులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా ?అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ అన్నారు. బుధవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ…నిన్నటి దినం మున్సిపల్ కార్యాలయం దగ్గర జరిగిన ఆందోళనలో అధికార వైఎస్ఆర్ పార్టీ నాయకులు గోరంతని కొండంత చేసినారు. దీనికి పూర్తి బాధ్యత వైయస్సార్ పార్టీ నాయకులది, మున్సిపల్ అధికారుల ది, పోలీస్ అధికారుల ది, మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజా ప్రతినిధులైన కౌన్సిలర్లకి చైర్మన్ లకి ప్రజల మౌలిక సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తామని ఈనెల 22వ తారీకు మా పార్టీ ప్రకటించింది. అన్ని వాట్సాప్ గ్రూపు లలో కూడా పెట్టామని రహస్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది కాదని, అందరికీ తెలిసిందే అని దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే కమిషనర్ మెమోరాండం తీసుకొని కౌన్సిల్లో చదివి వినిపిస్తానని మా పార్టీ వాళ్ళతో చెప్పి ఉంటే సరిపోయేది. లేదా పోలీసు అధికారు లైనా పోయి కమిషనర్ ను పిలుచుకు రావడంలో విఫలమయ్యారని, తలుపులు వేసుకొని కమిషనర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిపే అవసరం ఎందుకు వచ్చిందని,అందుకనే మా పార్టీ నాయకులు లోపల వెళ్లడానికి ప్రయత్నం చేశారు. ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.పోలీసు లకు నాయకుల కు తోపులాట జరిగింది. ఆ తోపులాటలో అద్దం పగిలింది. ఉద్దేశపూర్వకంగా పగలగొట్టలేదని తెలిపారు. మా పార్టీ నాయకుల ను పోలీసులు లాఠీ చార్జ్ చేసి రక్త గాయాలు అయ్యేటట్టు చితకబాదారనీ తెలిపారు.ఆ తర్వాత ఈ విషయం తెలిసిన వెంటనే డి.ఎస్.పి,సీఐ కి ,మెసేజ్ పెట్టానని మా పార్టీ ప్రమేయం ఏం లేదని తోపులాటలో అద్దాలు తగిలాయని చెప్పడం జరిగిందన్నారు ,అయితే వైయస్సార్ పార్టీ నాయకులు ఎస్ పి ,డి ఎస్ పి ,సి ఐ లకు, ఒత్తిడి చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు కుట్రపన్నారని తెలిపారు పోలీసులను పావులుగా మార్చి రాత్రి 12 గంటలకు జడ్జి ఇంటికి హాజరు పరిచారు. ప్రజా సమస్యల కోసం ఆందోళన చేస్తే ఇంత దుర్మార్గపు పనులకు వడి కడుతున్నారు. పట్టణ మౌలిక సమస్యలపై ప్రశ్నిస్తే సిపిఐ పార్టీనీ రౌడీలు గా సంబోధిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా పట్టణ సమస్యల పై వినతి పత్రాన్ని తీసుకోవడం తిరస్కరిస్తున్నారు . వేలకు వేలు జీతాలు తీసుకొని కూడా ఎటువంటి సమస్యలు పట్టించుకోలేదని, ఒక్క రూపాయి వేతనాలు లేకుండా ప్రజా సమస్యల కోసం ప్రశ్నిస్తే మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులని తెలిపారు.అధికార మదంతో, మేము మోనార్కు లం, చేస్తే చేస్తాము లేకుంటే లేదు అన్నట్టుందన్నారు. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే మా పార్టీ నాయకులు బయటికి వచ్చారు లేకుంటే జైలుకు వెళ్లేవారని అన్నారు. నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలు తీరుస్తారని వేచి చూసాం ,అయితే ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదనే ఉద్యమాలు చేస్తున్నామని ఇప్పటి నుండి 100 కేసులు పెట్టుకోండి, ఆందోళనలు ,ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు గుత్తిలో 15 రోజులకు ఒకసారి నీరు వదులుతున్నారని అన్నారు. ఈ విషయమై ప్రశ్నించకుండా ఎన్నుకుంటాం. పట్టణ అభివృద్ధి పై సహకరించేదానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఇటువంటి సమయంలో అందరి సహకారం తీసుకొని సమస్య ల పరిష్కారం కోసం కృషి చేయాలి అన్నారు. అది కాకుండా 8 మంది పైన కేసులో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పదిమంది కలిసి అద్దాలు పగలగొడితే ఎన్ని అద్దాలు పగులుతాయి, మీరే ఆలోచించండి. అక్కడ పగిలిన అద్దం ఒక జానెడు అద్దం మాత్రమే, ఉద్దేశపూర్వకంగా అద్దాలు పగలగొట్టింటే పూర్తిగా ధ్వంసం అయ్యేదని అన్నారు. ఇప్పటినుండి పట్టణ ప్రజా మౌలిక సమస్యలు తీర్చే వరకు భరతం పడతామని వచ్చే కౌన్సిల్ సమావేశం లో కూడా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు, దీక్షలు చేస్తామని హెచ్చరించారు.ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆగేది లేదని హెచ్చరించారు .చెత్త పన్ను, ఇంటి పన్ను ,నీటి పన్ను ఇలా మున్సిపాలిటీకి ఎక్కువ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పటికీ అత్యవసరమైనటివి పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు అధికారం శాశ్వతం కాదని అన్నారు .ఇప్పటికైనా పట్టణ మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్ర స్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌస్ ,సీపీఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,సీపీఐ మండల సహాయ కార్యదర్శీ రామంజినేయులు,ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాద్యాక్షులు దేవెంధ్ర,సీపీఐ నాయకులు మురళికిృష్ణ ,మల్లయ్య,ఉమ్మర్ బాషా,ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశికిృష్ణ ,ఏఐఎస్ ఎఫ్ నియోజికవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.