Friday, December 8, 2023
Friday, December 8, 2023

అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య..

ఏపీ.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి– జే. వి. రమణ

విశాలాంధ్ర ధర్మవరం:: అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పుట్టపర్తిలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి వెళ్లకుండా పట్టణ పోలీసులు ముందస్తు చర్యగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తదుపరి జేవి రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతుల సమస్యలను విన్నవించడానికి వెళ్ళనీయకుండా ఇలా అరెస్టు చేయడం అ ప్రజాస్వామ్యమని తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లాలోని 32 మండలాలకు గాను కేవలం 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి మిగిలిన 11 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం ప్రభుత్వమే యొక్క నిర్లక్ష్యమేనని వారు తెలిపారు. రైతుల పట్ల ప్రేమ ఏంటో ప్రభుత్వం వల్ల ఇప్పుడు బట్టబయలు అయిందని తెలిపారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని, బ్యాంకులలో ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, రవి సీజన్లో అవసరమైన విత్తనాలను, ఎరువులను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాలలో పశుగ్రాసం లేనందున గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మంచినీటి సౌకర్యము కల్పిస్తూ, గ్రామీణ రైతులు వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పనులను 300 రోజులు పెంచుతూ, 600 రూపాయలు కూలీ రేట్లు పెంచాలని, హంద్రీనీవా కాలవ ద్వారా 32 మండలాలలోని అన్ని చెరువులకు నీటిని సమృద్ధిగా అందించి, బోర్లు ఇంకిపోకుండా తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి రైతుకు పదివేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, తెలంగాణ ప్రభుత్వ తరహాలో ప్రతి ఎకరమునకు పదివేల రూపాయలు సాగు సహాయం చేయాలని, కేరళ ప్రభుత్వ తరహాలో రుణ విముక్తి చట్టాన్ని తీసుకొని రావాలని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు విన్నవించుకోవడానికి వెళ్లకుండా, రైతుల సమస్యలను సుడిగుండంలో ఉండేటట్టు చేయడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వలసలు ఆపాలని, జిల్లాలో కరువు సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన వెంటనే చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img