తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బి.ఎస్. కృష్ణారెడ్డి
విశాలాంధ్ర-గుంతకల్లు : జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెల్లవారుజామున అక్రమ అరెస్టును తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ కృష్ణారెడ్డి ఖండిస్తున్నారు. శుక్రవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బి.ఎస్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ… సిల్క్ డెవలప్మెంట్ కేసులో ఎకనామికి అపెన్స్ కింద క్రైమ్ నెంబర్ 29 /2021, సిఐడి 1 పిఎస్ నందు 9. 12.2021 నందు 26 మంది పై ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేశారన్నారు. చంద్రబాబు నాయుడు పేరు లేదు, ఇప్పటివరకు ఆయనను ఎటువంటి విచారణ చేయలేదు. సరే ముందస్తుగా ఎటువంటి41ఏ నోటీసు ఇవ్వకుండా ఇలా అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమని వివిధ రకాలైన తప్పుడు కేసులు పలు సెక్షన్లతో పెట్టడం జరిగిందని అన్నారు. న్యాయ స్థానంలో ధర్మము గెలుస్తుందని ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ప రంగా గవర్నమెంట్ అఫీషి యల్ గా ఉన్న వ్యక్తిని సామాన్య వ్యక్తిగా అరెస్ట్ చేయడం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.సుప్రీంకోర్టు మార్గ దర్శకాల ప్రకారం ఒక వ్యక్తిని సెలవు దినాల్లో శనివారం ఆదివారం లిఫ్ట్ చేయవలసిన పనిలేదని,పని దినాలలో లిఫ్ట్ చేయవచ్చునని , సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా కాదని అక్రమ అరెస్ట్ చేయాడాన్ని తివ్రంగా ఖండిస్తున్నామన్నారు.గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ (సి ) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఈ విషయంలో స్పష్టత కరువైందని గవర్నర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే అక్రమ నిర్బంధం అవుతుందని తెలియజేశారు.