Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అక్రమ మద్యం విక్రయదారులు అరెస్ట్

వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని బోయ వీధిలో కూరగాయల అంగడి దగ్గరకు శుక్రవారం రాబడిన సమాచారం మేరకు వెళ్లగా, అక్కడ బెల్టు షాపు ద్వారా అక్రమంగా మద్యం అమ్ముతున్న పార్వతీబాయి, అతని కుమారుడు వెంకటేష్ నాయక్ లను అదుపులో తీసుకొని, వారి వద్ద నుండి 30 ఆంద్రా మద్యం బాటిల్ లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేయడం జరిగిందని వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అనంతరం సిఐ మాట్లాడుతూ అక్రమ మద్యం విక్రయించుట చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా సరే జరిగిన ఎడల సెల్ నెంబర్ 9440796831 కు ఫోను చేయాలని తెలిపారు. సమాచారం అందించిన వారి పేరును గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబులు ఉమాశంకర్, నరసింహులు, శోభ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img