Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

అక్రమ మద్యం రవాణా చోరులు

ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.. వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం విలేకరులతో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పార్థసారధి నగర్, సాయిబాబా గుడి క్రాసులో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా, కారులో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న కడప జిల్లా సింహాద్రిపురం, బుడ్డయ్య పాలెం కు చెందిన కే. మధుసూదన్ రెడ్డి, కె. శివలింగారెడ్డి లను అదుపులోకి తీసుకొని విచారించగా, వారి నుండి 1459 కర్ణాటక టెట్రా ప్యాకెట్స్(విలువ 56,546,) 09 కర్ణాటక ఫుల్ బాటిల్స్ తో పాటు ఒక కారును(కారు నెంబర్ ఏపీ 13పి5859) కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తదుపరి ఇరువురు పైన కేసు నమోదు చేసి, కోర్టుకు పంపగా రిమాండ్కు తరలించినట్లు వారు తెలిపారు. పట్టణంలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మిన, రవాణా చేసిన, గంజాయి అమ్మిన, మట్కా, పేకాట ఆడిన, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అని తెలిపారు. అలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే సెల్ నెంబర్ 94407968312 సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారమిచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ మధ్యము కేసులో కృషిచేసిన హెడ్ కానిస్టేబుల్ నరసింహులు, కానిస్టేబుల్ అనిల్, అశ్వత్థ నారాయణ, మారుతి, దివాకర్లను సిఐ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img