Monday, September 25, 2023
Monday, September 25, 2023

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఉరవకొండలో కొనసాగుతున్న రిలే దీక్షలు

విశాలాంధ్ర – ఉరవకొండ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు    ఉరవకొండ పట్టణంలో  టిడిపి నాయకులు చేపట్టిన  రిలే నిరాహార దీక్షలు యధావిధిగా  కొనసాగుతున్నాయి. గురువారం విడపనకల్లు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొని  నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా  సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద  ఎత్తున నినాదాలు చేశారు. నిజాయితీ పరుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అక్రమంగా జైల్లో పెట్టి వైసిపి నాయకులు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని వారు పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె   దింపడానికి సిద్ధమయ్యారన్నారు. ఈ రిలే నిరాహారదీక్షల కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img