ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బందోబస్తు
విశాలాంధ్ర -అనంతపురం : భారత్ బంద్ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎస్సీ వర్గీకరణఫై సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా భారత్ బందుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చర్యలు చేపట్టారు.
ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో ప్రత్యేక పోలీసు బృందాలచే సంచరింపు