Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

పాండురంగ స్వామి దేవాలయంలో బాలవికాస్ సెంటర్ ప్రారంభం

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయములో ఆదివారం పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో బాలవికాస్ సెంటర్ ను కన్వీనర్ ఆచారి కుమార్తె మహేశ్వరి సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. బాల వికాస్ సెంటర్లో భక్తి భావన, క్రమశిక్షణ, తల్లిదండ్రులు గురువుల ఎడల సత్ప్రవర్తంచవలసిన మార్గాలు, సమాజంలో మంచి గుర్తింపు వచ్చే విషయాలు, పుట్టపర్తి బాబా యొక్క మహిమలు, చిన్న వయసు నుంచే భక్తి భావాలను అలవర్చుకునే విధానము, ఆధ్యాత్మిక విషయాలు, భక్తి పాటలు, శ్లోకాలు, నీతి కథలు తదితర విషయాలను నేర్పించడం జరుగుతుందని తెలిపారు. దీనివలన అతి చిన్న వయసులో ఉన్న పిల్లలకు మానసిక విలాసము అలబడుతుందని తెలిపారు. ఇప్పటికే బాలవికాస్ సెంటర్ల ద్వారా జిల్లాలో ఎంతో మంచి గుర్తింపు కూడా లభించడం సంతోషదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కన్వీనర్ ఆచారి, బాల వికాస్ గురువులు ఆదిలక్ష్మి, ఉమామహేశ్వరి, విద్యాసాగర్ సాంబశివుడు శేషాచారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img