Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

నూతన సచివాలయ కేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర-తాడిపత్రి: మండలంలోని గంగాదేవి పల్లి గ్రామంలో శనివారము నూతనంగా నిర్మించిన సచివాలయ, రైతు భరోసా కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన, సేవలను అందించాలని ఉద్దేశంతో నూతనంగా గ్రామ సచివాలయ, రైతు భరోసా హెల్త్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే గంగాదేవి పల్లి గ్రామంలోని ప్రజలకు, ఈ పంచాయతీ క్రింద ఉన్న ఆయా గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సేవలు, పాలన అందించాలని ఈ గ్రామంలో నూతనంగా సచివాలయ, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించామన్నారు. కావున ప్రజలు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మెంబర్ కురువ వెంకటరమణమ్మ గంగాదేవి పల్లి గ్రామ సర్పంచ్ హనుమంత రెడ్డి తాసిల్దార్ మునివేలు, కార్యదర్శి సంధ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img