విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో రైతు యల్లప్ప పొలంలో ఏటిఎమ్ సహకారంతో 0.50 ఎకరంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసిన ముల్లంగి, బీట్ రూట్, క్యారెట్ పంటలను మంగళవారం పరిశీలించారు. రైతుకు పంట వేసిన 15 రోజుల నుండి ఆదాయం వస్తుందని ఎంటీ రేవన్న తెలిపారు. భూమిలో జీవవైవిద్యం పెరిగి నేల సారవంతం అవుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలను రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉంచానని రైతు తెలిపారు.