జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమా మోహన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన ధర్మవరంలో గ్రంథాలయమునకు సభ్యత్వమును పెంచేందుకు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమా మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం వారు ఆకస్మికంగా గ్రంధాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం గ్రంథాలయానికి సంబంధించిన వివిధ రికార్డులను వారి తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠకులకు కావలసిన పత్రికలు లేదా వివిధ మాస పత్రికలు తెప్పించాలని తెలిపారు. దాతల ద్వారా గ్రంధాలయ అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. గ్రంథాలయంలో సమయ పాలనతో పాటు విధులను సేవా భావంతో కూడా నిర్వర్తించాలని తెలిపారు. గ్రంథాలయములో షెడ్యూల్ సమయం మేరకు పాఠకులకు గ్రంథాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. గ్రంథాలయం వలన కలుగు ప్రయోజనాలను పాఠశాల కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించే దిశలో మరింత కృషి ఎంతో అవసరం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.