Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రపంచానికే భారత రాజ్యాంగం గొప్ప మార్గనిర్దేశం

జిల్లా రెవెన్యూ అధికారి

విశాలాంధ్ర – పార్వతీపురం : ప్రపంచ దేశాలకు,మనదేశపౌరులకు భారత రాజ్యాంగం గొప్పమార్గనిర్దేశమని జిల్లా రెవిన్యూఅధికారి జె. వెంకటరావు అన్నారు. భారతరాజ్యాంగదినోత్సవ కార్యక్రమంను శనివారంనాడు జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వెంకటరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశపౌరులకు స్వేచ్చగా జీవించే హక్కును కల్పించిందన్నారు. పౌరులకు కొన్నిహక్కులు కల్పించడం ద్వారా స్వేచ్చగా మాట్లాడటం, సమాన న్యాయం పొందడం జరుగుతోందని చెప్పారు. ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను తెలియజేసి పౌరుల విధులు తెలియజేసిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుందన్నారు.భారతరత్న అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా అధ్యక్షులుగా రూపొందించిన ఈరాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దలిఖిత రాజ్యాంగమని తెలిపారు. అనేకమంది మేధావులు రెండుసంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని తయారు చేసి దిశానిర్దేశం చేశారని అన్నారు. నిత్యజీవితంలో ప్రజలు ఏవిధంగా నడుచుకోవాలో స్పష్టమైన సూచన చేసిందని ఆయనచెప్పారు. మన రాజ్యాంగానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగన్నాథరావు,డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, గ్రామవార్డు సచివాలయాల సమన్వయఅధికారి వి.చిట్టిబాబు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img