Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

ప్రపంచానికి భారత రాజ్యాంగం ఆదర్శం..

విశాలాంధ్ర- జె ఎన్ టి యు ఏ: ప్రపంచానికి భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలుస్తుందని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి. సుజాత పేర్కొన్నారు. శనివారం కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగాన్ని నవంబర్ 26న ఆమోదించిన మహోన్నత రోజు అని అన్నారు. రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం, హక్కులు ,విధులు , బాధ్యతలు , నైతిక విలువలను , సమాన హక్కులను పొందుపరిచిన రాజ్యాంగం మనది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అజిత, ఎస్కేయూ ప్రొ. పురుషోత్తం , ప్రో ఎన్.రమేష్ రెడ్డి, ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img