పాఠశాల కరెస్పాండెంట్ నిర్మల జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మరింత విస్తరింప చేయాలని కాకతీయ విద్యా నికేతన్ కరెస్పాండెంట్ నిర్మల జయచంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, శ్రీ కృష్ణాష్టమి వేడుకలను సంయుక్తంగా నిర్వహించుకున్నారు. అనంతరం పాఠశాల చిన్నారులు యొక్క వేషధారణలో శ్రీకృష్ణుడు, గోపికలు, కుచేలుడు అందరిని ఆకట్టుకున్నాయి. తదుపరి గోపికలు కృష్ణుడు యొక్క నృత్యం అందర్నీ ముగ్ధుల్ని చేసింది. చిన్నారుల ఉట్టి వేడుకలకు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులచే కృష్ణాష్టమి, ఉట్టి వేడుక, కుచేలుడు, కృష్ణుడి యొక్క స్నేహబంధం గురించి చక్కగా మాట్లాడడం పట్ల సంతోషాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేశారు. తదుపరి సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన విశిష్ట సేవ గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శెట్టిపి పద్మారెడ్డి, సూర్య ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.