Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హౌసింగ్ లేఅవుట్లకు విధిగా మౌలిక సదుపాయాలు కలిగించాలి

నూతన కలెక్టర్ అరుణ్ బాబు

విశాలాంధ్ర – ధర్మవరం : హౌసింగ్ లేఅవుట్లలో లబ్ధిదారులందరికీ మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నూతన కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ పోతుల నాగేపల్లి లే అవుట్ లలో నిర్మాణాల ను వారు ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రస్తుతం మాకు నీటి కొరత, విద్యుత్ కొరత అధికంగా ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు విన్నవించుకున్నారు. తదుపరి కలెక్టర్ అధికారులతో సమస్యను వెనువెంటనే పరిష్కరించాలని వారు ఆదేశించారు. నిర్లక్ష్యం లేకుండా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేవరకు అధికారులదే బాధ్యత అని తెలిపారు. మొత్తం ఇళ్లల్లో చాలావరకు పునాదులకే ఎందుకు పరిమితమయ్యాయని? కారణాలు ఏంటి అని వారు హౌసింగ్ అధికారులను ప్రశ్నించారు. పునాదులు పూర్తిచేసిన వారితో మాట్లాడి త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు రాకుండా చూడాలని, పేదవాని సొంతింటి కల నిజమయ్యేలా నిరంతరం అధికారులు శ్రద్ధ వహించాలని తెలిపారు. తదుపరి పట్టణంలోని మార్కెట్ యార్డులో జిల్లాకు కేటాయించిన ఈవీఎం గోడౌన్ గదులను వారు పరిశీలించారు. అన్ని గదులు జిల్లాకు అనుకూలంగా ఉండేలా చూడాలని, గోడౌన్ విషయంలో ఏదైనా సమస్యలు వచ్చిన యెడల నాకు సమాచారం అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ భవాని శంకర్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, హౌసింగ్.ఈ ఈ.. చంద్రశేఖర్, ఆర్డిఓ తిప్పే నాయక్, ఇంచార్జ్ తహసిల్దార్ యుగేశ్వరి దేవి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, హౌసింగ్ డిఇ మునీశ్వర నాయుడు, ఏఈ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img