Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు

విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నియోజకవర్గ కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జగనన్న కాలనీలో ఇల్లు నిర్మాణాలను వారు పరిశీలించారు. అనంతరం మధు మాట్లాడుతూ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న 1,80, 000 రూ .లు చాలదని, ఐదు లక్షలకు పెంచాలని తెలిపారు. బాధితుల పక్షాన సిపిఐ పోరుబాట నడుపుతూనే ఉంటుందని, టిడ్కో ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారని, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అధికారంలోకి వచ్చిన తర్వాత స్వార్థపూరిత అంశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు మంజూరు చేసినప్పటికీ కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ధరల పెరుగుదల ప్రభావంతో లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, అప్పుల పాలు అవ్వడం చాలా బాధాకరమని తెలిపారు.అనంతరం లబ్ధిదారులతో రేగాటిపల్లి లేఅవుట్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ, సంతకాల సేకరణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ కార్యదర్శి రవికుమార్ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట స్వామి, కార్యదర్శి వెంకటనారాయణ, నాయకులు శ్రీధర్, శంకర, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img