Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

మల్లువోలు పీ హెచ్ సీ తనిఖీ

విశాలాంధ్ర- గూడూరు: పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లువోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎన్ హెచ్ ఎం డి పి ఎం ఓ సుదర్శన బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పి హెచ్ సీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవల అమలు తీరును పరిశీలించారు. వివిధ కార్యక్రమాలకు సంబంధించిన రిజిస్టర్లు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు .గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడవలసిన బాధ్యత క్షేత్రస్థాయిలో సిబ్బందిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు వి .శివరామకృష్ణ, టి. మాధవి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img