విశాలాంధ్ర – చాగలమర్రి : చాగలమర్రి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను నంద్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పరిషత్ బాలుర,బాలికల ఉన్నత పాఠశాలలను,మండల పరిషత్ ప్రధాన ప్రాధమిక పాఠశాలను పరిశీలించామన్నారు.ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు గ్రామీణ స్థాయిలో రెండు,అర్బన్ స్థాయిలో నాలుగు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఓటర్లకు రెండు కిలో మీటర్ల లోపు పోలింగ్ కేంద్రాలు ఉండేటట్లు కృషి చేస్తామన్నారు.ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో 2.25 లక్షల మంది ఓటర్లుండగా అందులో 1.13లక్షల మంది స్త్రీలుండగా, 1.12లక్షల మంది పురుషలున్నారన్నారు.ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మండలంలో 54 మంది బిఎల్‌ఓలతో చనిపోయిన ఓటర్లను,బోగస్ ఓటర్లను తొలగించేందుకు సర్వే చేసి ఫారం – 7 ద్వారా తొలగించడం జరుగుతుందన్నారు.బోగస్ ఓటర్ల తొలగింపుకు ఈ నెల 27 చివరి తేదన్నారు.మండలంలోని ఆరు గ్రామాలలో భూ రీసర్వే పూర్తైందన్నారు.ఈ గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్,వాల్యుయేషన్ 13 వ నోటిఫికేషన్ క్లియరెన్సు రావడంతో చాగలమర్రి,మల్లెవేముల,పెద్దవంగలి,చిన్నవంగలి,వనిపెంట,ముత్యాలపాడు గ్రామాలలో హద్దురాళ్ళ ఏర్పాటు చేస్తున్నామన్నారు.అందులో డి.వనిపెంట,ముత్యాలపాడు గ్రామాలలో పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయన్నారు.అనంతరం పాఠశాలలో మద్యాహ్న భోజనం పథకాన్ని తనిఖీ చేశారు.కార్యక్రమంలో హెచ్‌ఎం కోటయ్య,బిఎల్‌ఓలు ధరణి,ప్రసన్న,పర్వీన్,నరేష్,విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.