విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ నుంచి వెలిగొండకు వెళ్లే రహదారి పనులును గురువారం మండల వైస్ ఎంపీపీ నరసింహులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, పెన్నహోబిలం ఆలయ మాజీ చైర్మన్ అశోక్ కుమార్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఆంజనేయులు, ఉలిగప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ నరసింహులు మాట్లాడుతూ ఉరవకొండ నుంచి వెలుగొండ కు వెళ్లే రహదారి గత అనేక సంవత్సరాలుగా మరమ్మత్తులు లేక శిఖలావస్థకు చేరుకోవడం జరిగిందని దీనివల్ల ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారడంతో ఈ విషయాన్ని తాము మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి గాను గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 1.85 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని కాంట్రాక్టులుకు కూడా సూచించడం జరిగిందన్నారు మరో నాలుగు రోజుల్లో ఈ పనులన్నింటినీ పూర్తిచేసి వెలుగొండ గ్రామ ప్రజలకు రహదారి ఇబ్బందులను తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.