Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

వేరుశనగ పంటకు బీమా అందజేయాలి : సిపిఐ

విశాలాంధ్ర బ్యూరో -శ్రీ సత్యసాయి : మండలంలోని వేరుశనగ రైతులకు ప్రభుత్వం తక్షణమే బీమా పరిహారం అందజేయాలని ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ నాయకులు మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోనే పెద్ద మండలం గా పేరుగాంచిన ముదిగుబ్బ మండలంలో 70 శాతం మంది వేరుశనగ పంట జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వేరుశనగ పంటకు ప్రభుత్వం భీమా పరిహారం ఒక్క పైసా కూడా అందజేయకుండా మండలానికి మొత్తం పూర్తిగా విస్మరించి కేవలం కంది , చీని తదితర పంటలకు మాత్రమే పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు. ముఖ్యమైన వేరుశనగ పంటను పూర్తిగా పక్కన పెట్టి ఒక్క రూపాయి కూడా వేరుశనగ రైతన్నలకు అందించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా జగనన్న ప్రభుత్వం మండలంలోని వేరుశనగ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే వేరుశనగ పంటకు కూడా తగినంత రీతిలో పరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలోనే సిపిఐ పార్టీ నే కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలిసి పెద్ద ఎత్తున నిరంతర ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు హెచ్చరించారు.. అనంతరం వారు తమ డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసిల్దార్ నాగేంద్రకు అందజేశారు.. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు గుంజేపల్లి కృష్ణయ్య, తిప్పయ్య, రామకృష్ణ, అదెప్ప, వెంకటనారాయణ చాంద్బాషా, లింగప్ప ఈశ్వర్ నాయక్, మార్కండేయులు రాధాకృష్ణ, కుల్లాయప్ప, వెంగమనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img