Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఈనెల 11 వ తారీకు వరకు అంగన్వాడి కేంద్రాల్లో వేడుకలు

విశాలాంధ్ర-గుంతకల్లు : మండలంలోని కసాపురం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో సోమవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్పవతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పుష్పవతి మాట్లాడుతూ ఆడ మగ తేడా లేకుండా సమానంగా చదివించి వారి పట్ల శబ్ద చూపించి మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలియజేశారు. మహిళా బిడ్డగా అక్కగా చెల్లిగా భార్యగా కోడలుగా తల్లిగా ఇలా ఎన్నో బాధ్యతలతో తన కర్తవ్యాన్ని విధులు నిర్వహిస్తుందన్నారు.చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల పెరుగుదల లేకుండా తల్లి బిడ్డ మరణించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జమ్యత్ బేగం,ఆశాబి, ఏ డబ్ల్యూ డబ్ల్యూ ఎస్ అంగన్ వాడి టీచర్ లు ,ఆయాలు ,తల్లులు విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img