Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవర : పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో బుధవారం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను నిర్వహించుకున్నామని డైరెక్టర్ పృధ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేసి యోగాసనాల యొక్క ప్రదర్శన కూడా నిర్వహించడం చాలా బాగుందని తెలిపారు. యోగా చేయడం వలన శారీరక, మానసిక, ఉల్లాసము, జ్ఞాపక శక్తిని, చురుకుదనాన్ని పెంపొందించుకోవచ్చునని తెలిపారు. ఈ యోగా ప్రదర్శన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తో పాటు ప్రిన్సిపాల్ అను వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, బోధనేతర బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img