Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

బోగస్ ఓట్లపై విచారణ చేపట్టాలి… ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో దాదాపుగా 17,110 బోగస్ ఓట్లు గుర్తించామని, వాటిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం అమరావతి వెలగపూడి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5/1/2023 వ తేదీన ప్రచురింపబడిన ఓటర్ లిస్టును సర్వే చేయించగా బోగస్ ఓట్లు వచ్చాయని, ఈ విషయమై వైయస్సార్ పార్టీ బూతులు ఏజెంట్లతోనూ పార్టీ శ్రేణులతోనూ సమావేశం నిర్వహించిన తర్వాత ఈ వాస్తవాలు బయటపడ్డాయని తెలిపారు. కావున త్వరితగతిన ఈ బోగస్ ఓట్ల పై విచారణ చేపట్టి న్యాయం చేయవలసినదిగా వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img