Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ప్రతిపక్షాల మీద ముఖ్యమంత్రి కేసులు పెట్టడం సరి అయిన పద్ధతి కాదు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రజా వ్యతిరేక విధాలను ప్రభుత్వాన్ని అడిగితే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమంజసం కాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ అపార రాజకీయ అనుభవం ఉన్నవారు, ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్నవారిని ఎటువంటి ముందస్తు చర్యలు పాటించకుండా, కోర్టు సమాన్లు కూడా పంపకుండా, ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకుండా అక్రమంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. నేడు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదని రాష్ట్రవ్యాప్తంగా ముక్తకండం ముక్తకంఠముతో అరెస్టు నిరసనలు తెలియజేసిన కూడా, ప్రభుత్వము నుండి స్పందన లేకపోవడం దారుణమని తెలిపారు. ఒక రాజకీయ నాయకున్ని ప్రభుత్వం అరెస్టు చేస్తే పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేస్తే ముందస్తు అరెస్టులు చేయడం పద్ధతేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు కి మా పార్టీ తరఫున సంఘీభావం కూడా తెలుపుతామని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు ఈ అరెస్టును అందరూ ఖండించాల్సిన బాధ్యత ఉందని వారు గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని తెలిపారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో నిరసనలు తెలిపే హక్కు కూడా ఈ జగన్ ప్రభుత్వములో లేదు అని తెలిపారు. భయపెట్టడం, దౌర్జన్యం చేయడం, అడ్డుకోవడం పరిపాటిగా మారిందని తెలిపారు. ఇటువంటి అరెస్టులకు, దాడులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నేడు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జరుగుతుందని, ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని వారు తెలిపారు. ఇకనైనా ముఖ్యమంత్రి కక్ష సాధింపులు వదులుకొని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడేలా కృషి చేయాలని వారితో పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img