Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందించడం మన బాధ్యత

విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీటిని అందించడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని ఎంపీడీఓ సాల్మన్ అన్నారు. శుక్రవారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో రైజెస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీలో 15మంది సభ్యులతో గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య కమిటీలు ఏర్పాటు చేయించాలన్నారు. అదేవిధంగా తాగునీటి పంపులు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం వీడబ్ల్యూఎస్సీ బ్యాంకు ఖాతాలను తెరవాలన్నారు. ఇందులో ఆపరేషన్ అండ్ మెయింటైనెన్స్ కోసం ప్రజలను కూడా భాగస్వామ్యం చెయ్యాల్సిన అవశ్యకత ఉందన్నారు. గ్రామాల్లో బోరుబావుల వచ్చే నీటిని తాగడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే పోషకాలు, లవణాలు ఉంటాయన్నారు. అదేవిధంగా ప్రతిరెండు నెలలకోసారి గ్రామాల్లోని నీటి నాణ్యతను ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పర్యవేక్షణలోని ఐదు మంది శిక్షణ పొందిన మహిళల చేత పరీక్షించాలన్నారు. అనంతరం ఆర్డబ్ల్యుఎస్ ల్యాబ్ అసిస్టెంట్ కిరణ్ నీటి నాణ్యతను పరిశీలించే విధానాన్ని చూపించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వెంకటేష్, రైజెస్ ఎన్జీఓ కోఆర్డినేటర్ షర్మిల, ఐఈసీ ఎక్స్పర్ట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img