Friday, April 19, 2024
Friday, April 19, 2024

మా నమ్మకం నువ్వే జగన్‌…

మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి

విశాలాంధ్ర -ఉరవకొండ : మా నమ్మకం నువ్వే జగన్ః.. కార్యక్రమాన్ని శుక్రవారం ఉరవకొండ పట్టణంలోని ఐదవ సచివాలయం పరిధిలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లు మరియు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్ః అనే నినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. నవరత్నాలు పథకాలు ద్వారా అర్హులైన పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. ప్రజలందరూ కూడా జగన్ ఆశీర్వదించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ నర్సింలు, ఉప సర్పంచ్ వన్నప్ప, సచివాలయ కన్వీనర్లు జోగి విజయ్, నిర్మల, వైసిపి పార్టీ నాయకులు జోగి వెంకటేశులు,హనుమంతు,మంజుల, రామిరెడ్డి, సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img