విశాలాంధ్ర -పెనుకొండ : వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దే మెరుగైన వైద్యం అందించడానికి మన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దే వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి 5 దశల్లో ఉచితంగా 7 రకాల పరీక్షలు అందించే వైద్య సదుపాయాలతో పాటు సలహాలు సూచనలు కూడా జగనన్న సురక్ష తరహాలోనే ప్రజల కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాని శనివారం మండల పరిధిలోని మునిమడుగు గ్రామంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎమ్మెల్సీ మంగమ్మ కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు.మీకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యం అందించడమే లక్ష్యంగా, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే ప్రభుత్వంగా, ప్రజల చెంతకే ప్రభుత్వ ఆరోగ్య యంత్రాంగం, రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎం నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ల వరకు మీ కుటుంబానికి అందించడానికి ఇలాంటి మంచి పథకాలను, కార్యక్రమాలను మన ఇంటి వద్దకే తెచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి మనం ఎంతగానో రుణపడి ఉంటామని, కృతజ్ఞతగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అ సత్యనారాయణ, ఎంపీపీ గీత రామ్మోహన్ రెడ్డి, జడ్పిటిసి శ్రీరాములు,వైస్ ఎంపీపీ కళావతి,శ్రీనివాసులు, స్థానిక నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.