Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

జగనన్న ఆణిముత్యాల పంపిణీ కార్యక్రమం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు సోమవారం జగనన్న ఆణిముత్యాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పాఠశాల నందు చదివిన విద్యార్థులు సంతోష్ నాయక్ 524 మార్కులకు గాను మొదటి ప్రైజ్ గా 3000 రూపాయలు మొత్తాన్ని చంద్రముఖి 5శీ4 మార్కుల సాధించినందుకు రెండవ ర్యాంకు కింద 2000 రూపాయలు మొత్తాన్ని అందించారు మహమ్మద్ పైసల్ 469 మార్కులకు గాను మూడవ ర్యాంకుగా వెయ్యి రూపాయలు బహుమతిగా అందిస్తూ వారికి ప్రశంసా పత్రాన్ని మెడల్ ని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ కమిటీ చైర్మన్ ఆశాలత ప్రధానోపాధ్యాయులు పద్మప్రియ పాల్గొని విద్యార్థులకు తమ యొక్క ఉపన్యాసము ద్వారా మంచి మార్కుల సాధించాలని ప్రభుత్వ బడులు ప్రైవేటు బడులతో పోటీపడి మంచి మార్కులు సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వము మీకు గుర్తించి ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నదని మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టికాహారము కల్పిస్తున్నదని, జగనన్న విద్యా కానుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున రాబోయే పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధులై బాగా చదువుకుని మంచి పేరు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయురాలు పద్మప్రియ కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గిరిజమ్మ, హనుమంత్ రెడ్డి, లక్ష్మి, నజీరా, అక్కమ్మ, సిఆర్పి అరుణమ్మ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మావుటూరు ఉన్నత పాఠశాల నందు ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్సిపి నాయకులు సుధాకర్ రెడ్డి పాల్గొని ఆణిముత్యాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు గుట్టురు జిల్లా పరిషత్ పాఠశాల నందు జడ్పిటిసి శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొని ఆణిముత్యాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఉర్దూ పాఠశాల నందు ముఖ్యఅతిథిగా నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ వైస్ చైర్మన్ సునీల్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని ఆణిముత్యాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img