Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

జగనన్న సురక్ష కార్యక్రమాలు లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి

ఎంపీడీవో.. సౌజన్యకుమారి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడిందని ఎంపీడీవో సౌజన్యకుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయుచున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా దాదాపుగా 98 శాతం మంది అర్హత గలవారు లబ్ధి పొందడం జరిగిందన్నారు. మిగిలిన రెండు శాతం మంది సరియైన దృవపత్రాలు వారి వద్ద అందుబాటులో లేక, సంక్షేమ పథకములు పొందలేక పోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హత గల వారు నూరు శాతం లబ్ధి పొందాలని సంకల్పంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని 11 రకాల ధ్రువపత్రాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. జూలై 1వ తేదీ నుండి 31 వ తేదీ వరకు వెసలు పాటు ప్రభుత్వం కల్పించడంతో, మండల పరిధిలోని గ్రామ పంచాయితీలలో జూలై 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు విజయవంతంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కుల ధ్రువీకరణ పత్రములు-8,773, ఆదాయ ధ్రువపత్రాలు-9,220, జనన ధ్రువపత్రాలు-67, మరణ ధ్రువపత్రాలు-01, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు-03, ఆధార్ కార్డుతో ఫోన్ కు అనుసంధానం-82, కొత్త/రేషన్ కార్డు నందు కుటుంబ సభ్యుల తొలగింపు-18, ఇతరాలు-213 వేరసి మొత్తం-18,377 పత్రాలను ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా విజయవంతం కు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img