Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

జగనన్న సురక్ష కార్యక్రమాలు పేదలకు వరాలు

విశాలాంధ్ర – ధర్మవరం : జగనన్న సురక్ష కార్యక్రమాలు పేద ప్రజలకు వరంలాగా మారాయని, పేదలందరికీ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి దశలో అమలు కావడం ఎంతో సంతోషదాయకమని మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ వీధి లోని కోట వార్డు ప్రజలకు మార్కండేయ టెంపుల్ యందు, యాదవ్ వీధి బ్రాహ్మణ వీధిలో గల ప్రజలకు కోటా స్కూలు యందు గురువారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, వాడు కౌన్సిలర్లు తీర్థాల స్వర్ణలత షకీలా చేతుల మీదుగా 1,993 సర్టిఫికెట్లను అర్హులైన వారికి పంపిణీ చేశారు. తదుపరి 2 కేంద్రాల ద్వారా 1,993 అర్జీలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చుటలో ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని, ఇప్పటికే ప్రజలు జగనన్న వెంట ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవలసిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆనంద్, టి పిఆర్ఓ. సుబ్బరాయుడు, వైయస్సార్సీపి నాయకులు తీర్థాల రమణ, సుభాన్ భాష, సి ఓ. గంగరత్నమ్మ, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img