విశాలాంధ్ర -ఉరవకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమాన్ని వైస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు మంగళవారం పరిశీలించారు.ఉరవకొండ పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్ లతో బృందంగా ఏర్పడి ప్రతి ఇంటా ఆరోగ్య సర్వేలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న ఆరోగ్య సర్వేపై వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు వీరన్న,వైస్ ఎంపీపీ నరసింహులు, తేజోనాథ్, గోవిందు, సుంకన్న, ఓబన్న, బసవరాజు, అశోక్ కుమార్,ఆసిఫ్, తమ్మన్న, చిన్న భీమా, ఏఎన్ఎంలు,,ఆశా కార్యకర్తలు,వలంటీర్లు పాల్గొన్నారు.