Monday, June 5, 2023
Monday, June 5, 2023

జగనాసురుడు – అవినీతి, నేరాల రాక్షసుడు

చిన్నాన్న హత్యను రాజకీయంగా వాడుకున్న ముఖ్యమంత్రి

విశాలాంధ్ర – కదిరి : జగనాసురుడు, అవినీతి, నేరాల అక్రమాల రాక్షసుడు, చిన్నాన్న హత్యను రాజకీయంగా వాడుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. టిడిపి తలపెట్టిన జగనాసుర రక్త చరిత్ర కార్యక్రమం పిలుపు మేరకు ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధం చేశారు సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశములో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఆయన చేసినటువంటి నేరాలు అతను చేస్తున్నటువంటి పరిపాలనపై మండిపడ్డారు. రాష్ట్రంలో భూ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, రైతు ద్రోహి, పేదల ద్రోహిగా, మహిళలకు రక్షణ లేదు బస్మాసుర ముఖ్యమంత్రిగా పేరుగాంచాడని తెలిపారు.
అపద్దపు, తప్పుడు హామీలతో ప్రజలకు మోసం – సొంత తల్లి, చెల్లికి కూడా మోసo చేసారన్నారు.
మూడు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ తుంగలో తొక్కి,ప్రభుత్వ దుకాణాల్లో విపరీతమైన కల్తీ మద్యం కారణంగా పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటూ జగన్ అండ్ కో తమ బినామీలతో కలిసి తాడేపల్లిలోని ఖజానాను నింపుకునే పనిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని,
ఉద్యోగులను మోసం
చేసింది చాలదనట్టు, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదని,ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి యువతను నయవంచన చేశారన్నారు. టీడీపీ హయాంలో పూర్తయిన 11 లక్షల ఇళ్లను కూడా పేదలకు పంపిణీ చేయడానికి జగన్ కు మనసురాలేదని విమర్శించారు. జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాకుండా తన సొంత తల్లిని, చెల్లిని కూడా మోసం చేశాడు. సొంత తల్లికి, చెల్లెలికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎం న్యాయం చేస్తాడని ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధి ఉత్తరప్రగల్పాలు పలికి నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, పట్టణంలో సరైన రోడ్లు లేవని తన స్వంత ఇంటి వరకు రెండు వరసలు రోడ్ వేశారని, వైకాపా నాయకుల భూ దందాలు ఎక్కువయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఖాదర్ బాషా, ఆల్ఫా ముస్తఫా, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ బాబు, మనోహర్ నాయుడు, డైమండ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img