Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

రాష్ట్రంలో జగన్ పాలన రావణాసురుని తలపిస్తుంది

మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన రావణాసురుని తలపిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ అన్నారు.సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ.జగన్ రెడ్డి పాలన రావణాసురుని తలపిస్తుందని పది తలల రావణుడు ఎలాగైతే తప్పు మీద తప్పు చేస్తూ వెళ్ళాడు అలాగే జగన్ రెడ్డి కూడా ఎన్నో తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడని ఆరోపించారు.మొదటగా అక్రమాస్తుల కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక భూ దందాలు,లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, రైతు వ్యతిరేకి, సొంత బాబాయ్ హత్య కేసు, మహిళలపై అఘాయిత్యాలు, అబద్దాలకోరు ఇలా పలు అంశాలలో జగన్ రెడ్డి రావణాసురుణ్ణి తలపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏది ఏమైనప్పటికి 2024లో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని జగన్ రెడ్డి పాలన అంతం కాక తప్పదని జితేంద్ర గౌడ్ ధీమా వ్యక్తం చేశారు..ఈ సమావేశంలో జి.వెంకటేష్ ,బి.ఎస్ ,కిృష్ణ రెడ్డి,తలారి మస్తానప్ప,వాల్మికి రాము,రంజాన్ ,కురువ సురేష్,నందీశ్వర్ పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img