Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

విశాలాంధ్ర-రాప్తాడు చంద్రబాబు నాయుడును రిమాండు విధించడం సరికాదని, కేవలం రాజకీయ కక్షతోనే సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని జై భీమ్ భారత్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ గౌరీ నరేష్ విమర్శించారు. టిడిపికి మద్దతుగా ఆయన రాప్తాడు మండల కేంద్రంలోని రహదారిపై సోమవారం కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి జైలుకు పంపడం సబబు కాదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి తీరతామని.. రాజ్యాంగ విరుద్ధంగా నడచుకుంటున్న సీఎం జగన్ ను ఇంటికి సాగనంపుతామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు .అనంతరం ఎస్సై పి వై ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి అరెస్టు చేసి రాప్తాడు పోలీస్ స్టేషన్కు తరలించారు కార్యక్రమంలో జై భీమ్ భారత పార్టీ నాయకురాలు స్వతంత్రకుమారి,  హుస్సేన్ బి, శాంతమ్మ, ప్రీతి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img