విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో శనివారం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభకర్ రెడ్డి, గన్నేవారిపల్లే మాజీ సర్పంచ్ చింబిలి వెంకటరమణ అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహా చారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాబట్టి అందరూ అవినీతిపరులు అనే బురద జల్లి అందరూ తనలానే జైల్ కు వెళ్ళాలని అనుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు.ఏ ఒక్క జనసైనికుడు, టీడీపీ కార్యకర్తలు కానీ కేసులకు భయ పడరని విమర్శించారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైసిపి ఎతులని చిత్తు చేసే విధంగా అద్భుతమైన వ్యూహంతో రెండు పార్టీలు కలిసి ఇంటికి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి సునీల్ కుమార్, దూద్ వలి, నాయకులు కిరణ్,గోపాల్, ఇమామ్, రబ్బానీ అయుబ్, శివకుమార్ రెడ్డి, అమీర్, పవన్ కళ్యాణ్,మని,కొండ శివ,హేమంత్ కుమార్,వెంకటేష్,మధు పవన్ కుమారు పాల్గొన్నారు.