Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి.. ధర్మవరం వాలంటీర్స్

విశాలాంధ్ర -ధర్మవరం : ఇటీవల రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లపై. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ధర్మవరం వాలంటీర్స్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని 40 వార్డులలో గల సచివాలయంలోని వాలంటీర్లు దాదాపు 500 మంది, వార్డు కౌన్సిలర్లు కలిపి నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం వాలంటీర్స్ కన్వీనర్లు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనలో వాలంటీర్లు కీలక పాత్ర వహిస్తున్నారని, వాలంటీర్లు మీద మొదట అవగాహన చేసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉండాల్సిందని తెలిపారు. రాష్ట్రంలోని వాలంటీర్స్ అందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం పవన్ కళ్యాణ్ కు సరైన పద్ధతి కాదని, నిజాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుందని సలహా ఇచ్చారు. ప్రభుత్వ వాలంటీర్లుగా తాము ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని మాత్రమే సేకరిస్తున్నామని తెలిపారు. గ్రామ, పట్టణాలలో ఆత్మీయులకు స్వచ్ఛందంగా సేవలందించే వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులతో పవన్ కళ్యాణ్ పోల్చడం దారుణమని తెలిపారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లుగా మేము బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి మానవత్వంతో సేవలను అందించామని వారు గుర్తు చేశారు. జనసేన అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. సేవాభావంతో పనిచేసే మా వాలంటీర్లు జోలికొస్తే, మేమేంటో నిరూపిస్తామని సవాల్ విసిరారు. వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా మరోసారి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలు నిరాధారమని తెలిపారు. నిస్వార్ధంగా పనిచేస్తున్న వాలంటీర్ లను చెడ్డవారిగా చిత్రీకరించడం తగదని సలహా ఇచ్చారు. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమం దాదాపు గంట పాటు కొనసాగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది పట్టణ వాలంటీర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img