జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలో కూడా శనివారం పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తారకరామాపురంలోని బీసీ బాలుర హాస్టల్ నందు పుస్తకాలు, పెన్నులు, ఫ్యాన్లు పంపిణీ ఉంటుందని, భావన నిర్మాణ కార్మికులతో భోజనాలు-పోతుకుంట రోడ్డు విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఆపోజిట్ దగ్గర నూతనంగా నిర్మిస్తున్న జన సేన పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందన్నారు. అదేవిధంగా గాంధీ నగర్ లో సాయంత్రం ఐదు గంటలకు పారిశుద్ధ్య కాలనీలో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ ప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు సామాజిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు తెలిపారు.