విశాలాంధ్ర – ధర్మవరం : జనసేన పార్టీ అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు శనివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాల్లో భాగంగా తొలుత భారీ కేకును కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని తారకరామాపురంలోని బీసీ బాలుర వసతిగృహం హాస్టల్ నందు 140 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, హాస్టల్ రూములోకి 10 ఫ్యాన్లు చిలకం మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. తదనంతరం హాస్టల్లోని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మినరల్ వాటర్ లేదు అన్న విద్యార్థుల సమస్యను విన్న చిలక మధుసూదన్ రెడ్డి త్వరలో మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ధర్మవరంలో నూతనంగా నిర్మిస్తున్న జనసేన పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకు పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసి, వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలను వచ్చి చిలకమ్మా రెడ్డి సమక్షంలో ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ టౌన్ కి చెందిన 30 మంది పార్టీ కండువా వేసి ఘనంగా ఆహ్వానించారు. పార్టీ చేరిన వారిలో డాక్టర్ గోవిందు, పెద్దన్న, భాష, ఓబుళపతి, సీన, ఖలీల్, రామస్వామి, రమణయ్య, రవి, పవన్ కుమార్,జాన్ బాషా, శ్రీరాములు, స్టూడియో అలీ తోపాటు పోతుకుంటకు చెందిన పదిమంది డేరంగుల ప్రకాష్, సాకే అనిల్ కుమార్, రాజా, ప్రకాష్, షేక్ బాషా, రాయుడు, శివ తదితరులు పార్టీలోకి చేరారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి పార్టీ ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటూ, తమ సమస్యలపై పరిష్కారాన్ని కూడా చూపుతుందని తెలిపారు.