Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీర్చడమే మా లక్ష్యం..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీర్చడమే జనసేన పార్టీ ముఖ్య లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ధర్మవరంలోని 25వ వార్డు తో పాటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. వార్డు ప్రజలు వద్ద చిలకంకు మంచి స్పందన రావడం జరిగింది. అనంతరం వారు ఇంటింటా తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న, పెద్ద వ్యాపారస్తుల అంగళ్ళ వద్దకు వెళ్లి, వారి సాధక బాధకాలను విన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ పోరాటాలను నిర్వహిస్తున్నారని, ఇప్పటికే రాష్ట్ర ప్రజల నుండి మంచి స్పందన రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాలుగా వైసిపి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగ్గు చెందారని తెలిపారు. వైసీపీ పాలను అంతమొందించేందుకే, ధర్మవరం ప్రజలంతా సహకరించి జనసేన పార్టీని 2024 ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ధర్మవరం నియోజకవర్గంలో తూతూ మంత్రంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కేవలం వైఎస్ఆర్సిపి నాయకుల స్వలాభం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వర్ణించడం జరుగుతుందన్నారు. శాశ్వతంగా జరిగేలా మా జనసేన పార్టీ తప్పక నిర్వహిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం తర్వాత రెండవ స్థానంలో ఉన్న చేనేత పరిశ్రమ నేడు ధర్మవరం నియోజకవర్గంలో చాలా వెనుకబడి ఉందని, చేనేత కార్మికుల కొరకు అహర్నిశలు మా పార్టీ కృషి చేస్తుందని, చేనేత కార్మికుల యొక్క కష్టాలను మా అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించి, పోరాటాలను సలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు వందలాదిమంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img