Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

జయహో ఇస్రో శాస్త్రవేత్తలు

విశాలాంధ్ర -రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని శుక్రవారం నాడు శాస్త్ర విజ్ఞానం చంద్రయాన్ 3 విజయం సంబరాలు సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ కార్యాలయలో అధికారులకు ప్రజలకు స్వీట్లు పంచారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. ఇస్రో శాస్త్రవేత్తల విజయానీకి భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు నుండి. ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్నో విజయాలు అపజయాలను చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారతదేశం వైపు చూసేలాగా మన ఇస్రోశాస్త్ర పరిజ్ఞానం రూపొందించారు. నాలుగు సంవత్సరాలు 2000 వేల మంది ఇస్రో శాస్త్రవేత్తలు కష్టపడి చంద్రయాన్ 3 ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని భారత దేశ మువ్వన్నెల జెండా చంద్రమండలంపై ఎగరవేయడం చాలా గర్వకారణం అన్నారు. అనంతరం మండల రెవెన్యూ అధికారులకు పట్టణ ప్రజలకు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో. సీపీఐ సిపిఎం తాలూకా ప్రధాన కార్యదర్శులు నాగార్జున మల్లికార్జున సిపిఐ పట్టణ ప్రధాన కార్యదర్శి కోట్రెష్.ఏఐఎస్ఎఫ్. ఏఐవైఎఫ్.నాయకులు అంజి కుమార్ సీపీఐ నాయకులు తిప్పేస్వామి నర్సింహులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img