విశాలాంధ్ర -ధర్మవరం:: ధర్మవరం నుండి తిరుమలకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనగా డిసెంబర్ 23వ తేదీ పర్వదినాన పురస్కరించుకొని, శ్రీ గోవింద మాల ధారణ సేవా కమిటీ ఆధ్వర్యంలో శ్రీవారి మహా పాదయాత్రను జయప్రదం చేయాలని దేవత కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవింద దీక్షలు తీసుకొని భక్తాదులు ఏడు వారములు అనగా ఈనెల 31 వ తేదీ నుండి నవంబర్ 4 వరకు మండల దీక్షలు, అదేవిధంగా నవంబర్ 10 నుండి 11వ తేదీ వరకు దీక్షలు చేపట్టవచ్చునని తెలిపారు. ఆసక్తిగల భక్తులు విరివిరిగా దీక్షలు ధరించి మహా పాదయాత్రలో పాల్గొనవలసినదిగా వారు తెలిపారు. వివరాలకు కమిటీ సభ్యులు దేవతా కృష్ణమూర్తి, పోష నాగరాజు, మాడుగుండ్ల రంగస్వామి, బద్దెల రమణ, గుర్రం లక్ష్మీనారాయణ, లింగం నారాయణస్వామి, అన్నం రామాంజనేయులు వారిని సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్..9440506071 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని తెలిపారు.