Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్ర జీపు జాతను జయప్రదం చేద్దాం

విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ నందు బుధవారం నగర పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జీపు జాత ఈనెల హిందూపురం నుండి 31 తేదీ నుండి జూన్‌ 9 వరకు రాష్ట్రజీపు జాత జయప్రదం చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ పిలుపునిస్తూ పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయం ముందు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, మాట్లాడుతూ కార్మికులు దుమ్ము, ధూళి మురికి నీరు ఆరోగ్యానికి లెక్కచేయకుండా పట్టణ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న కార్మికులపై పాలకులకు ఎటువంటి దయ కనికరం లేదు అధికారంలోకి రాకముందు జగనన్న వాగ్దానాలు వర్షం బివచ్చాక గుండు సున్నా అనే సామెత లాగా జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్నారు 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోనూ పాదయాత్రలో జగన్మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ ఉద్యోగులు ,కార్మికులు, కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ సిబ్బందికి వాగ్దానా ల వర్షం కురిపించారు .నగర మున్సిపల్‌ ఉద్యోగ కార్మికులు నూటికి 90 శాతం దళితులు మిగిలిన వారు బలహీన వర్గాల వారు మహిళల్లో కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌ విషయాన్ని అట్టెక్కించారు శాశ్వత స్వభావం కలిగి పర్యావరణాన్ని ప్రజా ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్న మున్సిపల్‌ కార్మికుల ఉద్యోగులను పర్మినెంట్‌ చేయకుండా ఆప్కాస్‌ అనే బానిస వ్యవస్థలో నెట్టుకు వేశారు. లక్ష రూపాయలు ఇచ్చిన కార్మికులు చేసే పని ఇతరులు ఎవరూ చేయరని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు జీతాలు పెంచక వారు కనీసం ఒకరు కల్పించక సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికులను పర్మినెంట్‌ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితిలో హామీలను నెరవేస్తారా లేక ఉద్యోగ కార్మికులు ద్రోహులుగా మిగిలిపోతారా కార్మికులు ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకై పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రమేష్‌, పెడబల్లి బాబా, బాబావలి, చిన్న వెంకటేష్‌ , ముత్యాలు, నరసింహులు, లక్ష్మీదేవి, శాంతమ్మ ,గంగ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img