ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఏ మల్లికార్జున
విశాలాంధ్ర అనంతపురం : బుధవారం స్థానిక రాణి నగర్ లో ని ఫెర్రర్ కాలనీ సీపీఐ కార్యాలయం నందు సూరి అధ్యక్షతన ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
సి.లింగమయ్య మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని తక్షణమే జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రతి ఆటో డ్రైవర్ కు 10,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి ఉన్నారు తక్షణమే అమలు చేయాలని కోరారు
డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సులో వదిలితే రవాణా రంగంలో పనిచేస్తున్న అత్యధిక శాతం డ్రైవర్లకు జీవనోపాధి కోల్పోతుందన్నారు. ఫ్రీ బస్సుల గురించి పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
అధ్యక్షులుగా
k నారాయణస్వామి
ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్ధన్
ట్రెజరర్ గా షబ్బీర్ భాష
ఉపాధ్యక్షులుగా హనుమంత రాయుడు సహాయ కార్యదర్శిగా ఆదినారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.