Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

కార్పొరేట్ నియామకాలలో జేఎన్టీయూ విజయభేరి

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల 2022-23 సం ” లో టి సి ఎస్ 118 మంది, సి టి ఎస్ 59, ఇన్ఫోసి 21 , ఫ్యాక్ట్ సెట్ సిస్టం ఆఫ్ ఇండియా 09 , డెక్కన్ ఫైన్ కెమికల్ 07 , మెవూర్క్ టెక్నాలజీ 14 , అల్స్తొం గ్రూప్స్ 4 (ఎంటెక్), మేధ సర్వో డ్రైవ్ 6 మంది, హెల్త్ కేర్ నౌ 5 మంది, ఐబీఎం కార్పొరేషన్ 06 , హెట్రో ల్యాబ్ లిమిటెడ్ 15 , ఇండిగో -ఎంఐఎం 10 , ఏ ఈ ఎస్ ఎల్ 05 , ఏరియా అసోసియేట్ 2 , కియా ఇండియా 01 ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి. సుజాత తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్, రెక్టార్ ఆచార్య యం. విజయ కుమార్ , రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ , డైరెక్టర్ అఫ్ ఇండస్ట్రియల్ & ప్లేస్ మెంట్ ఆచార్య వి. సుమలత అభినందించారు. ఎంపికైన విద్యార్థులకు అత్యధిక ప్యాకేజీ 10.08 లక్షలు నుంచి 7.2 లచ్చల వరకు ఉందని అన్నారు. ఈ సందర్భంగా వీసి,రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న సృజనాత్మక, నైపుణ్యాలు, వెలికితీస్తూ.. పారిశ్రామిక మేదో సంపత్తిని అందిస్తూ ఉజ్వల భవితకు పునాది జేఎన్టీయూ అని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కలలను సాకారం చేసేందుకు తమ వంతు సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img