Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఖాళీగా ఉన్నా ఉద్యోగాలలో వెంటనే భర్తీ చెయ్యాలి

విశాలాంధ్ర, కదిరి : ఖాళీగా ఉన్నా ఉద్యోగాలను వెంటనే భర్తీ చెయ్యాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లు కుళ్లా యప్ప డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో జిల్లా సమితి సమావేశంలో అయన మాట్లాడుతూ 12వ తేదీ జరిగే రాష్ట్ర మంత్రివర్గ క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగ సమస్య మీద చర్చించాలని కోరారు.ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయనీ నిరుద్యోగ సమస్య తగ్గించే విధంగా ఏ ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నికల సమయాల్లో యువతను ఆకర్షించడానికి అనేక అబద్దాల హామీలతో గద్దెనెక్కి పిచ్చిరా హామీలను గాలికి వదిలేసి యువతను రోడ్డు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాల భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలన్నారు. తక్షణమే మెగా డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్న 55 వేల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి వయోపరిమితి 45 ఏళ్లకు పెంచా లన్నారు. ప్రభుత్వ శాఖలలో ఉండే ఇంజినీరింగ్ ఉద్యోగాలు,భర్తీ చేసి పశుసంవర్ధక శాఖలో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు.లేని పక్షంలో నిరుద్యోగ యువతని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి.ఎం.నరసింహ,జిల్లా సహాయకార్యదర్శి.అబ్దుల్లా,నాయకులు నరేష్,ఇంతియాజ్,అక్బర్,విష్ణు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img