Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ఉపాధి కూలీలు వలసలు వెళ్లకుండా పనులు కల్పించాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెన్నా రాయుడు

విశాలాంధ్ర- ఉరవకొండ : జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి పథకం ద్వారా 150 పనిదినాలు కల్పించలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి చెన్నారాయుడు అన్నారు. గురువారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంత జిల్లాను కరువుజిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్స్ ను అమలు పరిచి ఒక్కో రైతుకు ఎకరా భూమి కేటాయించాలనిపేర్కొన్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని వీటన్నిటిని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి ఎంపిక పట్ల హర్షం సిపిఐ పార్టీ అనుబంధ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా బియం. చెన్నారాయుడు ఎంపిక పట్ల ఉరవకొండ నియోజకవర్గం సిపిఐ పార్టీ నాయకులు, ఉపాధి హామీ కూలీలు హర్షం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో జరిగిన జిల్లా మహాసభలలో చెన్నరాయుడను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ వ్యవసాయ కూలీల సమస్యల పైన ఉపాధి హామీ పథకం యొక్క ప్రత్యేకత ప్రజలకు వివరించడంలో చెన్నా రాయుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని వారు పేర్కొన్నారు ఉరవకొండ,విడపనకల్లు మండలాల్లో ఉపాధి హామీ కూలీలకు రావలసిన బిల్లులను మంజూరు చేయించడంలోనూ ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలోనూ చెన్నారాయుడు యొక్క కృషి మరువలేనిదని వారు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img