Friday, December 1, 2023
Friday, December 1, 2023

జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డి పై జరిగిన దాడికి న్యాయం చేయండి..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డి పై జరిగిన దాడిపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన రాజారెడ్డి పై జరిగిన దాడి హేయనీయమని, దాడి చేసింది ఎవరు? చేయించింది ఎవరు? అనే విషయాల పై వెంటనే చర్య తీసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేసే అవకాశం ఉందని వాటన్నింటినీ పోలీసులు కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా కొంతమంది అధికారుల మీద దాడులు చేపిస్తున్న వారి మీద కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. నాపై పెట్టిన ఆక్రమ కేసు గురించి కూడా ఎస్పీకు వివరించడం జరిగిందని తెలిపారు. స్పందించిన ఎస్పీ మాట్లాడుతూ వెనివెంటనే విచారణ జరిపి తమకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబూ, కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, కార్యదర్శి బొగ్గరం శ్రీనివాసులు, కార్యనిర్వాహన కమిటీ సభ్యులు కోటికి రామాంజి, గొట్లురు జీవి, రవి, సుధాకర్ రెడ్డి, భాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img