Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

జె వి వి వైజ్ఞానిక తరగతులు, గుత్తిలో

జూన్ 3 4 తేదీలలో
డార్విన్ కరపత్రాల ఆవిష్కరణ
విశాలాంధ్ర అనంతపురం వైద్యం
: జూన్ మూడు నాలుగు తేదీలలో, గుత్తి శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో జన విజ్ఞాన వేదిక వైజ్ఞానిక తరగతులు జరుగుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు జెవివి స్థానిక కమిటీల వద్ద నమోదు చేసుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ గేయానంద్ అన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని జె వి వి కార్యాలయంలో డార్విన్ ను పాఠ్య ప్రణాళిక నుండి తొలగించకూడదని కరపత్రాలనువిడుదల చేశారు. గుత్తిలో జరగబోతున్న జిల్లా వైజ్ఞానిక తరగతుల్లో ఈ అంశంపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలియజేశారు. శాస్త్రీయ దృక్పథం గురించి,విశ్వ ఆవిర్భావం గురించి, ప్రకృతి సూత్రాల గురించి, పరిణామ వాదం గురించి, సైన్స్ చరిత్ర గురించి ఈ తరగతుల్లో బోధిస్తారని తెలియజేశారు. విద్యా వైద్య రంగాలలో, శాస్త్ర ప్రచార రంగంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తారని చెప్పారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ క్లాసులను ప్రారంభిస్తారని అన్నారు. ఈ క్లాసులలో డాక్టర్ గేయానంద్, ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ ఇటి రామ్మూర్తి, డాక్టర్ ఆదిశేషు , డాక్టర్ రంగన్న, అమర్నాథరెడ్డి, జిలాని రామాంజనేయులు, మహేంద్ర రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు తరగతులు చెబుతారని అన్నారు. ఈ క్లాసులను జయప్రదం చేయటానికి, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జె వి వి కార్యకర్తలందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెవివి నగర అధ్యక్షులు ముత్యాలు, ప్రధాన కార్యదర్శి గాంగే నాయక్, కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ, ప్రసాద్, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img