Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన కాకతీయ విద్యా నికేతన్ పాఠశాల

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను తో ప్రభంజనం సృష్టించిందని పాఠశాల వ్యవస్థాపకులు సెట్టిపి రామిరెడ్డి, కరస్పాండెంట్ నిర్మల జయచంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 48 మందికి 48 మంది ఉత్తీర్ణత సాధించారని, ఇందులో 47 మంది ప్రధమ శ్రేణిలో కాగా ఒక విద్యార్థి ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. పాఠశాలలో టా పర్లుగా టీ. భవిష్య రెడ్డి 583 మార్కులు, బి. చంటి 582 మార్కులు, బి. బిందు 579 మార్కులు, వై. కాశీక్ రెడ్డి 570 మార్కులను కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా పుట్టపర్తి జిల్లాలోని పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన 11 పాఠశాలల్లో, కాకతీయ విద్యా నికేతన్ పాఠశాల మొదటి స్థానంలో ఉందని వారు తెలిపారు. అనంతరం నూరు శాతం ఉత్తీర్ణతకు కృషిచేసిన ఉపాధ్యాయులను, ప్రోత్సహించిన తల్లిదండ్రులను, పేరు,పేరునా వారు కృతజ్ఞతాభివందనాలను తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img